పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతినే పూజించాలని ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై ముత్యాల రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేసిన వినాయకుల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని దానివల్ల అనేక దుష్పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ మట్టితో తయారుచేసిన వినాయకులను మాత్రమే పూజించాలని పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.