చీమకుర్తి సమీపంలోని రామతీర్థం ఎన్ఎస్పి కాలువలో గుర్తుతెలియని మృతదేహం వెలుగు చూసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి. రామతీర్థం సమీపంలోని ఎన్ఎస్పి కాలువలో గుర్తుతెలియని మృతదేహం తేలాడుతూ ఉండడంతో గుర్తించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.