నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గురువారం కప్పల వాగు ఉదృతంగా పొంగిపొర్లడంతో ఎక్సయిజ్ కార్యాలయం నీట మునిగింది. అందులో ఇరుక్కున్న ఇద్దరు అధికారులు చిక్కుకుపోయారు. భీమ్గల్ పోలీసులు మత్సకారులతో కలిసి ఇద్దరు అధికారులను తాడు సహాయంతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో ఎక్సైజ్ అధికారులు పోలీసులకు, రెస్క్యూ టీంకు కృతజ్ఞతలు తెలిపారు.