భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాల వల్ల జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షించారు. భారీ వర్ష సూచనల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచరం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందికి సూచించారు.