గుంటూరులోని కొల్లి శారదా మార్కెట్ వద్ద వ్యాపారులు రోడ్డుపై శుక్రవారం బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇటీవల జరిగిన దుకాణాల వేలంలో తాము ఖాళీ చేయడానికి కొంత సమయం కోరినా అధికారులు ఇవ్వడం లేదని పాత వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 20 నిమిషాలుగా ట్రాఫిక్ స్తంభించి, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వ్యాపారస్తులతో మాట్లాడడంతో ఆందోళన విరమించారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించారు.