ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం వెలుగు వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ప్రముఖ న్యాయవాది విద్యావేత్త ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు చరిత్రను పాఠశాల హెచ్ఎం సుబ్బారెడ్డి వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు.