టిట్కో ఇళ్లలో ఏ3 బ్లాక్లో మంచినీటి సమస్యను, చెత్త సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం మున్సిపల్ ఆఫీసు వద్ద మంగళవారం రెండు గంటలకు ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతి పత్రాన్ని అందించారు.