శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర నాయక్ తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు, పని తీరును పరిశీలించి వ్యాధి నిరోధక టీకాలు, మాత శిశు సంరక్షణ, అంటువ్యాధులపై వివరాలు తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత, ఓపీ సేవలు, ఇంజెక్షన్, ల్యాబ్, కాన్పులు, పేషంట్లకు అందించే వైద్య సేవలను తనిఖీ చేసి ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని సూచించారు.