ప్రకాశం జిల్లా కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున వ్యాయామ ఉపాధ్యాయుడి అవతారమెత్తరు. ఆదివారం పోలీసు సిబ్బందితో కలిసి మొదట సైక్లింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఐ మల్లికార్జున తర్వాత కంభం పోలీసు స్టేషన్ ఆవరణలో యోగాసనాలు వేయించారు. నిరంతరం వ్యాయామం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వారికి వివరించారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో సైక్లింగ్ మరియు వ్యాయామం చేయడం వల్ల కలుగు ప్రయోజనాలను వివరించినట్లు సిఐ మల్లికార్జున తెలిపారు.