నల్గొండ జిల్లా, చింతపల్లి మండల కేంద్రంలో ఆగస్టు 3న హైదరాబాద్లో జరిగే ఆర్యవైశ్యుల సంఘం రాజకీయ రణభేరికి సంబంధించి ఆదివారం సాయంత్రం ఆర్యవైశ్యుల సంఘం చింతపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. ఆగస్టు 3న హైదరాబాద్లో జరిగే ఆర్యవైశ్యుల సంఘం రాజకీయ రణపేరికి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా ఆర్యవైశ్యులకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.