ఎన్నికల సమయంలో జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన నారా లోకేష్ హామీ ఏమైందని ప్రశ్నించారు ఏఐవైఎఫ్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి. అఖిలభారత యువజన సమైఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో షేక్ వలి మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ పై కూటమి ప్రభుత్వం మాట మార్చిందని మండిపడ్డారు. నిరుద్యోగులను మోసం చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.