కడప నగరంలోని జిల్లాపరిషత్ రోడ్డులో NCAP నిధులతో రూ.27 లక్షల వ్యయంతో నిర్మించనున్న BT రోడ్డు పనులకు ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవి గారు మాట్లాడుతూ.. ఈ రోడ్డు నిర్మాణం పూర్తవడంతో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయని, కడప నగర అభివృద్ధి దిశగా మరొక ముఖ్యమైన అడుగు పడిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాలకొండ్రాయ చైర్మన్ రెడ్డయ్య, సిటీ వైస్ ప్రాసిడెంట్ లయన్ మన్సూర్ ఖాన్ కర్నాటి అమర్,చిట్టి శివ రెడ్డి,లోమడ మనోజ్,సుధాకర్ రెడ్డి,వేణుగోపాల్,రమణ రెడ్డి, గారు స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు