ఎమ్మిగనూరుb: శిథిలావస్థలో గోనెగండ్ల పశువైద్యశాల.. రైతుల ఆవేదన గోనెగండ్ల ప్రాంతీయ పశువైద్యశాల నిత్యం నోరులేని మూగజీవాలకు సేవలందిస్తోంది. అయితే ఈ భవనం శిథిలావస్థకు చేరి వర్షం పడినప్పుడల్లా మందులు తడిసి ముద్దవుతున్నాయని రైతులు వాపోతున్నారు. రైతు ఎస్ఎన్ మాబు వలి మాట్లాడుతూ.. కర్నూల్-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై కొత్త భవనం నిర్మించి పశుసంపదను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.