బిట్ కాయిన్ ట్రేడింగ్ పేరుతో మహబూబాబాద్ లో ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు సైబర్ మోసానికి గురైనట్లు టౌన్ సిఐ మహేందర్ రెడ్డి శనివారం మధ్యాహ్నం 3:00 లకు తెలిపారు.. బిట్ కాయిన్ ట్రేడింగ్ లో 32 లక్షల 53 వేల రూపాయలను సైబర్ నేరగాళ్ళు భాధితుడి వద్ద నుంచి కాజేసారని తెలిపారు.. బాధితుడు మోసపోయానని గ్రహించి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.. ఎవరైనా సైబర్ నేరానికి పాల్పడితే తక్షణమే 1930 లేదా డయాల్ 100 కు సంప్రదించాలని సిఐ సూచించారు..