ఎమ్మిగనూరు : గోనెగండ్లలోని శ్రీ చింతలముని, నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు పురస్కరించుకొని శనివారం తెల్లవారుజామున స్వామివారి గుర్రపు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. గుర్రపు సేవ తిలకించడానికి నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చి శ్రీ చింతలముని, నల్లారెడ్డి స్వాములను దర్శించుకున్నారు. సీఐ విజయభాస్కర్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తును నిర్వహించారు.