విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులు గత నాలుగు సంవత్సరాలుగా ఎంతగానో పోరాడుతున్నారని, అయినప్పటికీ కేంద్రం తన మొండి వైఖరిని ప్రదర్శిస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఈకరణ వైపే మొగ్గు చూపడాన్ని సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి ఎం బేబీ ఖండించారు. పాత గాజువాక జంక్షన్ నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో ఏర్పాటైన ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రజల కోసమే పనిచేయాలని తెలిపారు.