రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయిన్పల్లి మండలం,మాన్వాడ గ్రామ శివారులో వాటర్ ట్యాంక్ సమీపంలో ద్విచక్ర వాహనదారుడుని DCM వ్యాన్ శనివారం 9:10 PM కి ఢీకొట్టి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది,కరీంనగర్ నుండి ద్విచక్ర వాహనంపై సిరిసిల్ల కి వెళ్తున్న నారాయణ మాన్వాడ శివారు వాటర్ ట్యాంక్ సమీపం కు రాగానే, వేములవాడ వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న DCM వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టి వెల్లి పోయింది,రోడ్డుపై పడిపోయిన నారాయణకు కాలు విరిగి తలకు తీవ్ర గాయాలయ్యాయి,హుటాహుటిన స్థానికులు 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు,ఈ ప్రమాదానికి చెందిన పూర్తి వివరాలు తెలియాలి,