కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో పాముకాటుతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగెం తండాకు చెందిన డేగవత్ అశోక్ కొడుకు రిషికుమార్ ఇంట్లో ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. దీంతో బాలుడిని హుటాహుటిన నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.