గంగవరం: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద వైఎస్ఆర్సిపి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద మరియు ముఖ్య నేతలు తెలిపిన సమాచారం మేరకు. ఆలకుప్పం వద్ద వైసిపి మండల అధ్యక్షురాలు కవిత మరియు వారి కుటుంబీకుల పైన కొంతమంది దౌర్జన్యం చేసి దాడులకు తెగబడ్డారన్నారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని దీని వెనక ఎవరున్నా సరే పోలీసులు కలుగజేసుకొని వారిపై చట్టరీ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గంగవరం మండలం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.