ముఖ్య మంత్రి నారా చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకం పేరైనా చెప్పగలరా అని వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నించారు. సోమవారం అమలాపురంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కాపీల పార్టీ అని విమర్శించారు. అమ్మ ఒడి, రైతు భరోసా వంటి పథకాలను కాపీ చేశారని ఆరోపించారు. సుగాలి ప్రీతి కేసులో ఆ కుటుంబానికి వైసీపీ అండగా నిలిచిందని చెప్పారు.