అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో డివైడర్ కు ఢీకొని యువకుడికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఆటోనగర్ బైపాస్ నుంచి బొమ్మకల్ వైపు వెళ్తున్న యువకుడు రాత్రి సమయంలో స్ట్రీట్ లైట్స్ లేకపోవడంతో దారి కనిపించక అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని, 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వం ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. అయితే గత కొంతకాలంగా కేబుల్ బ్రిడ్జి వద్ద లైట్లు రాకపోవడం, ఆ రోడ్డులో చీకటి ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.