ఏలూరు జిల్లా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో వైద్యునిగా పనిచేస్తున్న బత్తుల శివరామకృష్ణ (38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆస్పత్రిలోని క్వార్టర్స్ లో ఆయన మృతి చెంది ఉండటాన్ని ఆస్పత్రి యాజమాన్యం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత మూడు నెలలుగా హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో శివరామకృష్ణ విధులు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.