ఇచ్చోడలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ముందస్తు సమాచారం మేరకు మండల కేంద్రంలోని ఓ దుకాణంలో దాడులు నిర్వహించగా నిల్వ ఉంచిన 98 క్వింటాళ్ల పీడీఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నామని అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అధికారులు దినేష్ రెడ్డి, ప్రశాంతరావు, మండల ఎన్ఫోర్స్మెంట్ అధికారి జాదవ్ రామారావు పాల్గొన్నారు.