జిల్లాలో డెల్టా సిస్టం పటిష్టం, చెత్త నిర్వహణకు అనువైన మార్గాలపై దృష్టి సాధించేందుకు ఆలోచన చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర శాసనసభఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో జిల్లాలో డెల్టా సిస్టం పటిష్టం, చెత్త నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చెన్నై ఐఐటి ప్రముఖ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మరియు పోలవరం ప్రాజెక్ట్ మాజీ సలహాదారు డాక్టర్ వి.ఆర్ రాజు చర్చించారు.