అనంతపురం జిల్లా ఉరవకొండ డివిజన్ పరిధిలోని ప్రతి గ్రామంలోనూ దోమలు ప్రబలకుండా జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండ మండలంలోని రాకెట్ల, షేక్షానుపల్లి పల్లి ముల్లారంపల్లి, కోనాపురం రాచేపల్లి, షేక్షానపల్లి తండా, రాకెట్ల తండా గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై ఇంటింటా వెళ్లి అవగాహన కల్పించారు. జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా దోమల నివారణకు క్రిమిసంహారక మందులను పిచికారి చేయించారు.