ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి స్వీకరించిన 49 అర్జీలను సంబంధిత పోలీసు అధికారులకు ఎండార్స్ చేశారు. నిర్ణీత కాల వ్యవధిలో చట్ట పరిధిలో ఈ అర్జీలను పరిష్కరించాలని వారిని ఆదేశించారు. నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.