అర్హత ఉన్న దివ్యాంగులందరికీ పెన్షన్ అందుతుందని ఎవరు అధైర్యపడవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి శనివారం మీడియాకు తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ అర్హత లేని వారికి పెన్షన్ అందుతూ సంక్షేమ పథకాలు పక్కదో పడుతున్నాయనే ఉద్దేశంతో నోటీసులు ఇవ్వడం జరిగిందని అర్హత కలిగిన వారికి ఎవరికైనా నోటీసులు వస్తే వారు తిరిగి సచివాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు గతంలో ఎన్నడూ లేని విధంగా 2300 కోట్ల పెన్షన్ను ప్రతినెలా ప్రభుత్వం అందిస్తుంది అన్నారు ప్రతిపక్షాలు కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు