నిరుద్యోగ కళాకారులను ఆదుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ప్రకటన పట్ల నిరుద్యోగ కళాకారుల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, సాంస్కృతిక సారథి ఛైర్మన్ గద్దర్ వెన్నెల ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కళాకారులు స్వరాజ్, దత్తు, విలాస్, రాకేశ్ ఉన్నారు.