అనకాపల్లి జిల్లాలో రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలని ఏపీ రైతు సంఘం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు ఆదివారం చోడవరంలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వేలాది టన్నుల యూరియా అందుబాటులో ఉందని చంద్రబాబు ప్రకటించినట్లు తెలిపారు. అయితే జిల్లాలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. యూరియా కొరత కారణంగా రైతులు బ్లాక్ మార్కెట్లో యూరియాను కొనుగోలు చేస్తున్నారన్నారు.