గుడికల్ చెరువులో మృతదేహం లభ్యం..కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండల పరిధిలోని గుడికల్ చెరువులో సోమవారం మృతదేహం లభ్యమైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మృతదేహాన్ని ఆదోనికి చెందిన షరీఫ్ (33)గా గుర్తించారు. ఈనెల 11న ఆదోని త్రి టౌన్ స్టేషన్లో షరీఫ్ మిస్సింగ్ అయినట్లు షరీఫ్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.