వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బుధరావుపేట సొసైటీ వద్ద బుధవారం వీడియో కోసం రైతులు రాత్రి 9 గంటల నుండి మహిళలు చిన్నపిల్లలతో కలిసి నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది రైతులు రాత్రులు దుప్పట్లు చందర్లతో గోదాముల వద్ద యూరియా కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం బావుల వద్ద నిద్రించాల్సి వచ్చేదని ఇప్పుడు ఏరియా కోసం రాత్రింబవళ్లు మెలకువలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రభుత్వ పెద్దలు ఈ పరిస్థితిని గమనించి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.