మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సివిల్ డిపార్ట్మెంట్ లో గత కొన్ని సంవత్సరాలుగా సూపర్ వైజర్ గా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సామ్రాన్, అలాగే నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ సూపర్ వైజర్ రాంవెంకటేశ్వర్లను సివిల్ అధికారులు మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డివైఎస్ఈ శ్రీధర్ మాట్లాడుతూ సామ్రాన్ బాధ్యతగా నిబద్దతో కార్మికులను కలుపుకొని పోతూ కార్మిక కాలనీలలో ఎలాంటి సమస్యలు ఉన్న వెంటనే పరిష్కరించారని గుర్తు చేశారు. ఉద్యోగంలో బదిలీలు తప్పనిసరిగా ఉంటాయని సామ్రాన్ బదులీపై వెళ్తున్న ఎస్టీపీపీ లో కూడా తన సేవలను బాధ్యత యుతంగా అందించాలని సూచించారు.