సదాశివ నగర్ : గోల్డ్ షాప్ కోసం వేస్తున్న షెడ్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బంజె చిన్న ప్రభులింగం తన నివాసంలో షెడ్ నిర్మించాడు. అందులో ప్రస్తుతం ఫర్నీచర్ పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కొందరు వ్యక్తులు షెడ్డు వద్దకు వచ్చి ఫర్నీచర్ పై కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయారు. దాంతో షాప్ పాక్షికంగా కాలిపోయింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొంతమంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.