అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో 10 కోట్ల రూపాయలు వ్యయంతో జిసిసి కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని శుక్రవారం మాకవరపాలెం తహసీల్దార్ వెంకటరమణ జీసీసీ అధికారులకు లాంఛనంగా అప్పగించారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ పథకానికి శంకుస్థాపన చేయనున్నారని శెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామనాయుడు తెలిపారు.