చంద్రగ్రహణం పురస్కరించుకొని ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంను ద్వారబంధనం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 1-00 గంటలకు చంద్రగ్రహణం పురస్కరించుకొని ఆలయ అర్చకులు, అధికారులు ఆలయంను మూసివేసినట్లు ఆలయ ఈవో టి వెంకటేష్, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్ తెలిపారు. తిరిగి సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ, పాత కాల పూజ నిర్వహించిన అనంతరం స్వామివారి దర్శనాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, అర్చకులు పడిగన్నగారి అంజయ్య, పడిగన్నగారి మల్లన్న, మహాదేవుని భాస్కర్, మహాదేవుని మనోహర్, వీరేశం లింగం, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.