స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు చూపిన సాహసం స్ఫూర్తితో మన వంతుగా దేశానికి సేవ చేయాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పిలుపునిచ్చారు, శనివారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతిని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.