సిరికొండ మండలం లోని రావుట్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో వినాయక చతుర్థి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గణపతి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి మండపానికి తరలించారు. భజన కీర్తనలు ఆలపిస్తూ సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణోత్తమునిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. విడిసి సభ్యులు,గ్రామ పెద్దలు బొజ్జ గణపయ్యకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పార్వతి పుత్రున్ని ఆరాధిస్తూ భజన కీర్తనలు ఆలపించారు. పూజానంతరం ప్రసాద వితరణ చేశారు.