జడ్చర్ల నియోజకవర్గంలో ఆదివారం బాలానగర్ మండలం అప్పాజీపల్లి గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాలానగర్ నుండి గౌతాపూర్ వెళ్తుండగా, గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కంకర రోడ్డుపై పడటంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ప్రభాకర్ను ఆసుపత్రికి తరలించారు.