కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను, 66 సబ్ గ్యారెంటీలను అమలు చేయాలని సిద్దిపేట జిల్లా బిజెపి అధ్యక్షులు శంకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రూ 2,500 ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపు మేరకు , కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను, 66 సబ్ గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిద్దిపేట ఆర్డిఓ కార్యాలయం ఎదుట బిజెపి నాయకులు నిరసన ధర్నా చేశారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని వారి డిమాండ్ చేశారు.