తణుకు మండలం దువ్వలో వేంచేసిన వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.70 లక్షల వ్యయంతో కాలక్షేప మండపంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.