గంగవరం: మండలం సిఐ ప్రసాద్ తెలిపిన సమాచారం మేరకు, గురువారం నాడు కిట్టన్న మిషన్ వెనుక వైపు వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి గల్లంతైన విషయం అందరికీ విధితమే. నేడు అగ్నిమాపక శాఖ అధికారుల సహాయంతో ముమ్మురంగా గాలింపులు చేయగా, పలమనేరు పట్టణం పల్లి వీధికి చెందిన శ్రీనివాసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కొరకు పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా మృతుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారన్నారు.