మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన మంగళవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనకు చెందిన అజ్మీరా సుఖేందర్ గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ సంపత్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.