జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి,చలి తీవ్రత ప్రజలకు వణుకు పుట్టిస్తుంది.శీతాకాలం ప్రారంభంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే రాబోయే డిసెంబర్, జనవరి మాసాలలో ఎలా ఉండబోతుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. నవంబర్ 15 నుంచి ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోతుంది. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు పెరిగి రాత్రి వేళల్లో చలి తీవ్రత కనిపిస్తుంది. ఈనెల 25 వరకు జిల్లాపై చలి తీవ్రత ప్రభావం అధికంగా ఉండబోతుందని అధికార వర్గాలు హెచ్చరిస్తున్నాయి. జిల్లాలో శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 12 గ నమోదు అయింది.