ధర్మవరం పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అరపర సౌకర్యాలతో అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారని ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో అన్ని వసతులతో కూడిన అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతిరోజు 15 వీధి కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు నిర్వహిస్తారని తెలిపారు.