అస్వస్థకు గురై నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను నరసాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా సునీత రెడ్డి మాట్లాడుతూ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే అస్వస్థకు గురైన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఘటన విషయమై సిడిపిఓ హేమ భార్గవ్ కి ఫోన్ చేసి మరల ఇలాంటి సంఘటనలు పునరాప్తంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.