జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,కొండగట్టులో 2 కార్లు ఢీకొని మంగళవారం 3:40 PM కి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది,దైవ దర్శనం నిమిత్తం హైదరాబాద్ నుండి కొండగట్టుకు రమేష్ కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు కారులో వస్తుండగా,మరో కార్లో జగిత్యాల నుండి హైదరాబాద్ కు వెళ్తున్న లక్ష్మణ్ కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు కొండగట్టు స్టేజి సమీపం వద్దకు రాగానే 2 కార్లు ఎదురెదురుగా డీకున్నాయి,దీంతో 2 కార్లలో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా స్థానికుల సహాయంతో హుట హుటిన గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,