పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారిగా కొమ్ము అప్పలస్వామి సోమవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తాహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న అప్పల స్వామి పరిపాలనాధికారిగా పదోన్నతి పొందారు. ఆయనకు పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, పలువురు తాహశీల్దారులు పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేశారు.