Download Now Banner

This browser does not support the video element.

సిద్దిపేట అర్బన్: నంగునూరు మండలం నర్మెటలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Siddipet Urban, Siddipet | Sep 20, 2025
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మితమవుతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయిల్ తయారీ ఉత్పత్తిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పలు విషయాలపై ఆయిల్ ఫెడ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us