చైతన్యపురిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను రీఫిల్ చేస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దిల్సుఖ్నగర్ బస్ స్టాండ్ సమీపంలో ఒక గదిలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నింపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై సీఐ కె. సైదులు దాడులు నిర్వహించి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా సిలిండర్ల ఫిల్లింగ్ చేస్తున్నందుకు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.