వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమాన్ని సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎడపల్లి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెస్ట్ సీనియర్ సిటిజన్ అవార్డు గ్రహీతలైన శ్యామ్ రావు దేశ్ముఖ్, హనుమంతరావు, శ్యామ్లాల్, లక్ష్మి నారాయణ గౌడ్, కొప్పుల గంగారాం, రాధ మెర్సీ లను సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎడపల్లి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎడపల్లి తాసిల్దార్ దత్తాత్రేయ తో పాటు, సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వనాథం, బోధన్ పట్టణ సీనియర్ సిటిజన్ ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు ఉన్నారు.